Prabhas Hits 37 Cars For An Action Sequence In Saaho

Filmibeat Telugu 2018-05-21

Views 2K

Prabhas's Saaho is the next big thing in Telugu film industry, Starring Bollywood actors Shraddha Kapoor and Neil Nitin Mukesh, Saaho is being filmed in Abu Dhabi. Prabhas has Hits 37 real cars for a sequence in the film.

బాహుబలి సంచలన విజయం తర్వాత యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ నటిస్తున్న సాహో చిత్రం అబుదాబిలో యాక్షన్ పార్టు పూర్తి చేసుకోబోతున్నది. భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్లను హాలీవుడ్ ప్రమాణాలకు అనుగుణంగా తెరకెక్కిస్తున్నారు. ఫైట్స్ రియల్టిక్‌గా ఉండేందుకు కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉపయోగించకుండా రియల్‌గానే షూట్ చేయడం గమనార్హం. సాహో కోసం ఫైట్స్ తీస్తున్న ఫైట్స్ అటు బాలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ చర్చనీయాంశమయ్యాయి.
సాహో ఫైట్స్ సీన్లలో భాగంగా ప్రభాస్ పలు కార్లను తుక్కుతుక్కు చేసేశాడట. షూటింగ్‌లో భాగంగా ఒకటి కాదు ఏకంగా 37 కార్లను యంగ్ రెబల్ స్టార్ ధ్వంసం చేసినట్టు బాలీవుడ్ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
కార్ల ధ్వంసాన్ని ఖర్చుకు వెనుకాడకుండా, గ్రాఫిక్స్‌ను ఉపయోగించకుండా షూట్ చేయడంపై ప్రభాస్ మాట్లాడుతూ.. సినిమా కోసం ముందుగానే ఇలానే ఫైట్స్ షూట్ చేయాలని అనుకొన్నాం. ఆ క్రమంలోనే రెండేళ్ల క్రితం హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ కెన్నీ బేట్స్‌ను సంప్రదించాం. ప్రతీది యాక్షన్ పార్టును లైవ్‌గానే షూట్ చేయాలని నిర్ణయించాం. షూటింగ్‌లో రియల్ కార్లను ఉపయోగించాం. గాల్లో కార్లు పల్టీలు కొట్టడం ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతుంది అని ప్రభాస్ అన్నారు.
సాధారణంగా యాక్షన్ సీన్ల కోసం 70 శాతం కంప్యూటర్ గ్రాఫిక్స్, 30 శాతం రియల్‌గా చిత్రీకరిస్తాం. కానీ అబుదాబీలో షూట్ చేసిన పార్ట్‌లో వందశాతం రియలిస్టిక్‌గా చిత్రీకరించాం అని ప్రభాస్ తెలిపారు. ఈ చిత్రంలో ప్రభాస్ సూపర్ బైక్‌ను ఉపయోగిస్తున్నారట. ఆయన చేసే విన్యాసాలు ప్రేక్షకులను అబ్బురపరుస్తాయని చిత్ర యూనిట్ పేర్కొంటున్నారు.

Share This Video


Download

  
Report form