CSK skipper MS Dhoni sets record of taking most catches in T20 cricket. Dhoni took 144 catches and over took Kumar Sangakara. In the match against KXIP Dhoni took 3 catches.
#Dhoni
#ChennaiSuperKing
#DelhiDaredevils
#Record
#IPL2018
ఈ మ్యాచ్‌కు ముందు ధోని ఆరు వేల పరుగులు చేసేందుకు గాను 10 పరుగుల దూరంలో ఉన్నాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోని 17 పరుగుల వద్ద బౌల్ట్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ధోని టీ20 క్రికెట్‌లో ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
అంతకముందు సురేశ్ రైనా(7,708), విరాట్ కోహ్లీ (7,621), రోహిత్ శర్మ(7,303), గౌతమ్ గంభీర్(6,402)లు ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ధోనికి ఇది 290వ టీ20 మ్యాచ్. అంతేకాదు ఐపీఎల్‌లో నాలుగువేల పరుగుల క్లబ్‌కు ధోని చేరువయ్యాడు.
ఇదిలా ఉంటే శుక్రవారం రాత్రి చెన్నై-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిమానుల నుంచి ధోనికి అరుదైన గౌరవం దక్కింది. అంబటి రాయుడు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనికి అభిమానులు ధోని.. ధోని.. అంటూ తన సెల్‌ఫోన్లలోని లైట్‌ను ఆన్‌చేసి చూపిస్తూ స్వాగతం పలికారు.
సుమారు ఒక నిమిషం పాటు ధోని నామస్మరణతో స్టేడియమంతా మారుమోగిపోయింది. ఈ మ్యాచ్‌లో చెన్నై 34 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ బెర్తుని దక్కించుకున్న సంగతి తెలిసిందే.