IPL 2018 : SunRisers Hyderabad Teammates Wear Black Armbands In Qualifier 1

Oneindia Telugu 2018-05-23

Views 211

SunRisers Hyderabad players wore black armbands during the Indian Premier League (IPL) 2018 Playoffs, Qualifier 1, clash against Chennai Super Kings at the Wankhede Stadium in Mumbai on Tuesday.
#rashidkhan
#sunrisershyderabad
#srh
#ipl2018

ఐపీఎల్ 11లో ఫైనల్ మ్యాచ్ అర్హత సాధించేందుకు చెన్నై సూపర్ కింగ్స్‌తో హైదరాబాద్ తలపడింది. ఈ మ్యాచ్‌కు సన్‌రైజర్స్ టీమ్ మెంబర్స్ అందరూ చేతులకు నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగారు. దీని వెనుక ఓ కారణం ఉంది. ఆఫ్ఘనిస్థాన్‌లోని నాన్‌గర్హర్ ప్రావిన్స్‌లో జరిగిన బాంబు దాడికి నిరసనగా ఇలా నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్ జట్టులో ఆటగాడైన రషీద్ ఖాన్ కూడా ఓ అఫ్గనిస్తాన్ వాసే.
టీమ్ మెంబర్స్ అందరూ నల్ల బ్యాండ్లు ధరించి రషీద్‌ఖాన్‌ను గౌరవించారు. దీంతో ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు థ్యాంక్స్ చెప్పింది. ఆ ఘటనలో నష్టపోయిన వారిలో రషీద్ ఖాన్ ప్రాణ స్నేహితుడు కూడా ఉన్నాడు.
రమజాన్ సందర్భంగా ప్రత్యేక ఈవెంట్‌ను నిర్వహించే ప్రాణ స్నేహితుడు హిదాయతుల్లాను కోల్పోవడంతో రషీద్ ఖాన్ విషాదానికి గురైయ్యాడు. 'మేము నిన్ను మిస్సవుతున్నాం. ప్రతి క్షణం నాన్‌గారర్ ప్రాంతాన్ని వెలుగొందేలా చేశావు. అమరుడవైన నీ ఆత్మకు అల్లాహ్ శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను.' అని ట్వీట్ చేసి తన బాధను బహిర్ముఖంగా వ్యక్తం చేశాడు.
సన్‌రైజర్స్ టీమ్ తరఫున బౌలింగ్‌లో అదరగొడుతున్నాడు రషీద్ ఖాన్. ఈ సీజన్‌లోనూ ఆడిన 15 మ్యాచుల్లో 18 వికెట్లు తీసి సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. తొలి క్వాలిఫయర్‌లోనూ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 11 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అందులో ధోనీ వికెట్ కూడా ఉంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS