SRH Juggernaut Running Out of Fuel After Covering 5,000 Km

Oneindia Telugu 2018-05-25

Views 4

Sunrisers Hyderabad came into the tournament as strong contenders for a playoff berth, and did that in style as they finished at top of the points table. They peaked for almost the entire duration of the league games, and so did their bowlers. But in the last 5 matches, their form has completely gone for a toss as they have lost four games during this time.


ఐపీఎల్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ సందిగ్ధతల నడుమ బరిలోకి దిగి అంచనాలకు అనుగుణంగా రాణించింది. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంతో జట్టు నుంచి నిషేదానికి గురవడంతో డేవిడ్ వార్నర్ బదులుగా కేన్ విలియమ్‌సన్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. దీంతో కొత్త కెప్టెన్ సరిగా రాణిస్తాడా అనే సందేహం అందరిలోనూ నెలకొంది. వీటన్నిటికీ ధీటుగా సమాధానమిస్తూ.. పాయింట్ల పట్టికలో లీగ్ దశ ముగిసేంతవరకూ టాప్ 1గా కొనసాగింది.
అంతేకాకుండా పాయింట్ల పట్టికలో నంబర్-1గా ప్లేఆఫ్ దశలోకి అడుగుపెట్టింది. ప్లేఆఫ్ బెర్త్‌ను ముందుగానే ఖాయం చేసుకున్న సన్‌రైజర్స్ తప్పని పరిస్థితుల్లో చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. ముఖ్యంగా తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో అనూహ్యంగా ఓడటంతో.. ఈడెన్‌గార్డెన్స్‌లో రెండో క్వాలిఫైయర్ ఆడాల్సిన పరిస్థితి తలెత్తింది.
దీంతో ఫైనల్ మ్యాచ్ లో అర్హత పొందేందుకు వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిన సన్‌రైజర్స్.. గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలుపొందిన కోల్‌తాతో పోటీ పడుతోంది. ఈ మ్యాచ్ లో గెలుపొందితేనే చెన్నైతో పోటీపడగలిగేది.
అయితే ఆఖరుగా ఆడిన ఐదు మ్యాచ్‌ల కోసం సన్‌రైజర్స్ దాదాపు 5 వేల కి.మీ. ప్రయాణించింది. ఢిల్లీతో మ్యాచ్ పూర్తయిన తర్వాత సన్‌రైజర్స్.. చెన్నైతో మ్యాచ్ ఆడేందుకు పుణే వెళ్లింది. ఢిల్లీ, పుణేల మధ్య దూరం 1181 కి.మీ. తర్వాత ఆర్‌సీబీతో మ్యాచ్ కోసం బెంగళూరు (736 కి.మీ.) వెళ్లింది. మళ్లీ బెంగళూరు నుంచి 501 కి.మీ ప్రయాణించి హైదరాబాద్‌లో కోల్‌కతాతో తలపడింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS