Afghanistan star cricketer Rashid Khan showcased his all-round skills to single-handedly propel Sunrisers Hyderabad to a 13-run win over Kolkata Knight Riders in the second Qualifier of the Indian Premier League, here on Friday (May 25).
#ipl2018
#rashidkhan
#t20spinner
#sachintendulkar
#sunrisershyderabad
రషీద్ ఖాన్.... ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోన్న ఆటగాడు. బౌలర్‌గా ఓ వైపు రాణిస్తూ.. అవసరమైన సమయాల్లో బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా, హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రషీద్ ఖాన్ చెలరేగిపోయాడు.
10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు... కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా అత్యుతమ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. అతని ఆట తీరుపై పలువురు మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్‌పై పలువురు క్రికెటర్లు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రషీద్‌ని అభినందిస్తూ.. ట్వీట్ చేశారు. ''ఇంతకాలం రషీద్ మంచి బౌలర్ అనే అనుకున్నాను. కానీ ఇప్పుడు అతను ప్రపంచంలోనే ఈ ఫార్మాట్‌లో అత్యుత్తమమైన స్పిన్నర్ అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. గుర్తుంచుకోండి.. అతని గొప్ప బ్యాటింగ్ ప్రతిభ కూడా ఉంది. గ్రేట్ గాయ్'' అని సచిన్ ట్వీట్ చేశారు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం చెన్నైతో తలపడుతుంది. ఐపీఎల్ ఫైనల్‌కు చేరడం రైజర్స్‌కు ఇది రెండోసారి. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 174 పరుగులు చేసింది.
సాహా (27 బంతుల్లో 5 ఫోర్లతో 35), ధావన్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 34) రాణించగా ఆఖర్లో రషీద్ ఖాన్ మెరుపు ఇన్నింగ్స్‌తో హైదరాబాద్ జట్టుని ఆదుకున్నాడు. కుల్దీప్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బరిలోకి దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 160 పరుగులకే పరిమితమైంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రషీద్ ఖాన్‌కు దక్కింది.