IPL 2018 : 'Heartbroken' Dinesh Karthik Praises Rashid Khan

Oneindia Telugu 2018-05-26

Views 45

Kolkata Knight Riders (KKR) captain Dinesh Karthik on Friday heaped praises on Sunrisers Hyderabad's (SRH) Rashid Khan, saying that the Afghani cricketer stepped up to the occasion.

ఐపీఎల్ టోర్నీలో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఓటమి పాలవ్వడంపై కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉందని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
ఈ సీజన్‌ ఆద్యంతం తాము ఆకట్టుకున్నప్పటికీ కీలక మ్యాచ్‌లో ఓడిపోవడం నిరాశకు గురి చేసిందని అన్నాడు. మ్యాచ్ అనంతరం దినేశ్ కార్తీక్ మాట్లాడుతూ 'రషీద్ ఖాన్‌కు చక్కటి రోజు. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఇక, ఫీల్డింగ్‌ కూడా బాగా రాణించాడు. క్రెడిట్ మొత్తం రషీద్ ఖానే‌దే' అని అన్నాడు.
ఇలాంటి గేముల్లో వ్యక్తిగత ప్రదర్శన ఎంతో ముఖ్యం. ప్రత్యర్ధి జట్టును తన అద్భుతమైన ప్రదర్శనతో ఒత్తిడిలోకి నెట్టాడు. ఈరోజు రషీద్ ఖాన్‌ది' అంటూ దినేశ్ కార్తీక్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ఈ టోర్నీలో ఇప్పటివరకు వరకు మేం చక్కటి ప్రదర్శన చేశాం. ఇది మాకు మంచి టోర‍్నమెంట్‌. కానీ ఫినిషింగ్‌ బాలేదు' అని కార్తీక్ తెలిపాడు.
ఛేజింగ్‌ చేసే సమయంలో మాకు గొప్ప ఆరంభం లభించింది. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాం. 10 ఓవర్ల వరకు గేమ్ మావైపే ఉంది. కొన్ని చెత్త షాట్లు మా కొంప ముంచాయి. నాతోపాటు నితీష్‌ రాణా, రాబిన్‌ ఉతప్పలు మ్యాచ్‌ను ముగిస్తే బాగుండేది. అలా జరగలేదు. దాంతో ఓటమి చూడాల్సి వచ‍్చింది' అని దినేశ్ కార్తీక్ పేర్కొన్నాడు.
'సన్‌రైజర్స్‌ మాకంటే మెరుగ్గా రాణించి గెలుపును సొంతం చేసుకుంది. ఈ ఐపీఎల్‌లో యువ క్రికెటర్లు వారికి వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకున్నారు. క్రెడిట్ మొత్తం సన్‌రైజర్స్‌కే ఇవ్వాలి. వారి టార్గెట్‌ను డిఫెండ్ చేసుకున్న తీరు నిజంగా అద్భుతం. ఈడెన్ గార్డెన్‌లో రెండుసార్లు మమ్మల్ని ఓడించారు' అని దినేశ్‌ కార్తీక్‌ పేర్కొన్నాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయిర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతాకి ఓపెనర్లు మంచి ఆరంభాన్ని అందించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS