Chennai Super Kings beat Sunrisers Hyderabad by 8 wickets in the final of the 2018 Indian Premier League at the Wankhede Stadium in Mumbai.CSK lifted their third IPL trophy on Sunday.Reinstated into the IPL after a two-year ban for their team management's role in the 2013 spot-fixing scandal, CSK won their third IPL trophy after a gap of seven years.
#chennaisuperkings
#sunrisershyderabad
#ipl2018
#Awards
వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ తుది సమరంలో చెన్నై జట్టు గెలుపొందింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. సీజన్ ఆరంభం నుంచి బౌలింగే ప్రధాన బలంగా విజయాలను సొంతం చేసుకున్న రైజర్స్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా 2 ఓవర్లు ఉండగానే మ్యాచ్ దాదాపు చెన్నై చేతికి అప్పజెప్పేశారు. వాట్సన్ దూకుడుకు బెంబేలెత్తేసిన బౌలర్లు ఓటమిని ముందుగానే అంగీకరించారు.
అయితే ఈ మ్యాచ్ అనంతరం ఐపీఎల్ ట్రోఫీని అందుకున్న ధోనీ మాట్లాడుతూ.. 'అందరూ నమ్మినట్లే సెంటిమెంట్లను నమ్ముతాను కానీ, దాంతో పాటుగా జట్టు ప్రదర్శన కూడా కీలకమే కదా' అని తెలిపాడు. ఫైనల్ మ్యాచ్ అనంతరం ఈ లీగ్ మొత్తంలో క్రికెటర్లు సాధించిన రివార్డులు, అవార్డుల వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తమ మైదానం: ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా (రూ. 50 లక్షలు)
ఆరెంజ్ క్యాప్- విలియమ్సన్ (రూ.10 లక్షలు)
సీజన్ మరి కొద్ది రోజుల్లో మొదలైపోతుందనగా డేవిడ్ వార్నర్ కెప్టెన్‌గా రద్దు చేస్తూ సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దాంతో హైదరాబాద్ జట్టుతో పాటు అభిమానులు కూడా జట్టు పరిస్థితి గురించి ఆందోళనకు గురైయ్యారు. అలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్సీ బాధ్యతలు భుజానికేసుకున్న విలియమ్‌సన్ రైజర్స్‌ను 18 పాయింట్లతో ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. అది కూడా మిడిల్ ఓవర్లలో లో డాట్ బాల్ పర్సంటైజ్ కొనసాగిస్తూ నడిపించాడు. అయితే ఈ లీగ్ కు సంబంధించి కేన్ వ్యక్తిగత స్కోరు 735 పరుగులు. ఈ సీజన్‌కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కాగా, ఐపీఎల్ మొత్తంలో విరాట్ కోహ్లీ (973), వార్నర్ (848) అతనికంటే ముందున్నారు.