Hero Raj Tarun Raju Gadu Movie Team Special Interview

Filmibeat Telugu 2018-06-01

Views 3.6K

Young actor Raj Tarun, who has stuttered in recent times after an encouraging start to his film career, is looking to bounce back with his Raju Gadu', starring Raj Tarun, Amyra Dastur and Rajendra Prasad, will hit the screens on June 1.

ఉయ్యాలా జంపాలా','సినిమా చూపిస్త మావ','కుమారి 21ఎఫ్‌' వంటి చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్స్‌ కొట్టిన రాజ్‌ తరుణ్‌ ఈ మధ్య రంగుల రాట్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకురాలు సంజన ఈ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రి ఎవ్వబోతోంది. రాజుగాడు సినిమా జూన్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ తో ఇంటర్వ్యూ...
నేను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో చేస్తున్న నాలుగో చిత్రమిది. సంజనా రెడ్డి చాలా చక్కగా తెరకెక్కించింది. హీరో క్యారెక్టరైజేషన్, రాజేంద్రప్రసాద్ గారి కామెడీ ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నాయి. సంజనా రెడ్డి నూతన దర్శకురాలు అయినప్పటికీ చక్కగా ఈ సినిమాను తెరకెక్కించడం జరిగింది.
రాజుగాడు సినిమాలో హీరో క్లెప్టోమేనియా అనే వింత వ్యాధితో భాధపడుతుంటాడు. ఈ వ్యాధి లక్షణం ఏంటంటే.. తనకు తెలియకుండానే తన చెయ్యి దొంగతనం చేయడం. ఇది ఒకరకంగా వింత జబ్బు అనాలి. ఈ జబ్బు బయట చాలా మందికి ఉంటుంది.
సినిమాలో హీరో పేరు రాజు కావడంతో అందరు రాజుగాడు అని పిలుస్తూ ఉంటారు. అందుచేత సినిమాకు రాజుగాడు టైటిల్ పెట్టడం జరిగింది. సినిమా మొత్తం ప్రేక్షకులను నవ్విస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా హాయిగా నవ్వుకొని వెళ్ళే సినిమా రాజుగాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS