Sri Reddy Makes Sensational Comments Roja, Nagababu

Filmibeat Telugu 2018-06-06

Views 2.8K

SriReddy targets Pawan, Roja, Nagababu. She made sensational comments on Roja
#SriReddy
#Roja

శ్రీరెడ్డి గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్, అతడి కుటుంబమే టార్గెట్ గా సోషల్ మీడియాలో వరుస విమర్శలు చేస్తోంది. గతంలో శ్రీరెడ్డిని పిలిచిమరీ డిబేట్లు పెట్టిన కొన్ని ఛానల్స్ ఇప్పుడు ఆమె సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. దీనికి కారణం పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అని అంతా చర్చించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా దిగజార్చడమే లక్ష్యంగా శ్రీరెడ్డి తన విమర్శలు పవన్ పై సంధిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె రోజా ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు.
తాను ఇండస్ట్రీలోని రెండు కుటుంబాలతో పెట్టుకున్నానని శ్రీరెడ్డి తెలిపింది. దీని వలన తన జీవితాన్ని చిదిమేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారని శ్రీరెడ్డి ఆరోపించింది. ఈ కుట్రలో తాను బలి కాబోతున్నానంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియా ద్వారా తెలిపింది. పవన్ కళ్యాణ్, సురేష్ బాబు కుటుంబంతో పెట్టుకున్నందుకే తనపై కుట్ర జరుగుతోందని శ్రీరెడ్డి తెలిపింది.
తనకు రీల్ హీరోలు నచ్చరని శ్రీరెడ్డి తెలిపింది. తన అభిమాన స్టార్ నారా చంద్రబాబు నాయుడు అని పచ్చ జెండా వర్ధిల్లాలి అంటూ శ్రీరెడ్డి సోషల్ మీడియాలో సంచలన కామెంట్స్ చేసింది.
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ రాజకీయపరమైన విమర్శలు శ్రీరెడ్డి చేస్తోంది. పవన్ కళ్యాణ్ చిన్న పొరపాటు చేసిన తన సోషల్ మీడియా ద్వారా బూతద్దంలో చూపించే ప్రయత్నంచేస్తుందనే విమర్శలు వస్తున్నాయి.

Share This Video


Download

  
Report form