Sachin Tendulkar Teases Sehwag In A show

Oneindia Telugu 2018-06-11

Views 51

While the relation between Sehwag and Sachin is the best one would ever see on and off the field, it might come as a surprise to many that Sehwag didn’t talk to Sachin in his early days in the Indian cricket team.

వీరూ నోరు మూయడానికి అరటి పళ్లు ఇవ్వాల్సి వచ్చేదని సచిన్ చెప్పుకొచ్చాడు. ఇటీవల ప్రముఖ టీవీ కార్యక్రమానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్, సెహ్వాగ్‌లు తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ ఓపెనింగ్ జోడీగా భారత్‌కు చక్కటి ఆరంభాలిచ్చారు.
ఇటీవల వాట్ ద డక్ పేరిట విక్రమ్ సథాయే నిర్వహించిన షోలో ఇద్దరు దిగ్గజ క్రికెటర్లు పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. వీరూ డ్రెస్సింగ్ రూంలో తెగ మాట్లాడే వాడని చెప్పిన సచిన్.. అతడు మాట్లాడకుండా ఉండటం కోసం అరటి పండును ఇచ్చేవాణ్నని చెప్పాడు. డ్రెస్సింగ్‌లో అరటి పండుతో వీరూ నోరు మూయించగలిగా కానీ.. సోషల్ మీడియాలో మాత్రం అతణ్ని ఆపడం మన వల్ల కాదని సచిన్ చెప్పాడు.

Share This Video


Download

  
Report form