Director Karthik About Arjun Reddy Movie. Sensational comments on RGV
అర్జున్ రెడ్డి చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. జాతీయ వ్యాప్తంగా ఈ చిత్రం హాట్ టాపిక్ గా మారింది. పరభాషా నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ హక్కులని సొంతం చేసుకునేందుకు ఎగబడ్డారు. హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ వంగా ఓవర్ నైట్ లో క్రేజీ సెలెబ్రిటీలు గా మారిపోయారు.
తన అభిమాన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని కార్తీక్ తెలిపాడు. ఈ విషయం చెబితే నమ్మరని తనకు నచ్చిన దర్శకుడు కూడా పవన్ కల్యాణే అంటూ ట్విస్ట్ ఇచ్చాడు. తాను జానీ చిత్రం చూశాకే దర్శకుడిని కావాలని అనుకున్నట్లు కార్తీక్ తెలిపాడు.
కార్తీక్ రూపొందిస్తున్న ఎంత ఘాటు ప్రేమయో చిత్ర కాన్సెప్ట్ వీడియో ఇటీవల విడుదల చేశారు. అర్జున్ రెడ్డి చిత్రాన్ని పోలిఉందని, అర్జున్ రెడ్డి 2 అంటూ వస్తున్న కామెంట్స్ పై కార్తీక్ స్పందించాడు. తన చిత్రాన్ని అర్జున్ రెడ్డి 2 అనడం నచ్చడం లేదని కార్తీక్ తెలిపాడు.
అర్జున్ రెడ్డి చిత్రం హీరో నటన, దర్శకుడు ప్రతిభ ఆధారంగా విజయం సాధించిన చిత్రం అని అన్నారు. అర్జున్ రెడ్డి చిత్రం బావుంది కానీ కథ పరంగా గొప్ప చిత్రం కాదని కార్తీక్ అభిప్రాయ పడ్డాడు.