Vijay Deverakonda Auction His First Filmfare Award

Filmibeat Telugu 2018-06-18

Views 1K

Tollywood actor Vijay Devarakonda received his first award for his outstanding performance in Arjun Reddy. The actor took his Filmfare Award recently and he said that he would auction the award. All the received money will be donated to Chief Minister’s Relief Fund.


ఫిల్మ్ ఫేర్స్ అవార్డ్ అందుకున్న నటుడు విజయ్ దేవరకొండను తెలంగాణ మంత్రి కేటీఆర్ అభినందనలతో ముంచెత్తారు. తొలి ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నందుకు కంగ్రాట్స్ తెలిపారు. అవకాశం ఉంటే ఈ అవార్డును వేలం వేసి సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇస్తానంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఫిదా అయ్యారు.
'అర్జున్ రెడ్డి' చిత్రంలో నటనకుగాను 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో విజయ్ దేవరకొండ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, జూ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి దిగ్గజాలు రేసులో ఉండగా.... విజయ్ దేవరకొండ అందరినీ వెనక్కి నెట్టి ఈ అవార్డు అందుకున్నారు.
కెరీర్లో తొలి ఫిల్మ్‌ఫేర్ అవార్డు, అందులోనూ ఉత్తమ నటుడు కేటగిరీలో అందుకోవడంపై విజయ్ దేవరకొండ చాలా సంతోషంగా ఉన్నారు. అవార్డు అందుకున్న అనంతరం దాంతో ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.
నా వరకు నేను యాక్టర్ అవ్వడమే పెద్ద గెలుపు. ఇండస్ట్రీ రెస్పెక్ట్, డబ్బులు ఇచ్చినపుడు మరోసారి గెలిచినట్లు అనిపించింది. మమ్మీ డాడీకి సొంతిల్లు కొన్నపుడు ఇంకోసారి గెలిచినట్లు అనిపించింది. అభిమానులను సొంతం చేసుకున్నపుడు మరోసారి గెలిచినట్లు అనిపించింది. ఈ అవార్డు నాకు బోనస్ లాంటిది. ఈ అవార్డును సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇవ్వడానికి సిద్ధమే... వారు తీసుకోవడానికి అంగీకరిస్తే రేపు వెళ్లి ఇచ్చేస్తాను. ఇది నా సెల్ఫ్ మీద ఉండటం కంటే నేను పుట్టిన సిటీ కోసం ఉపయోగపడితే బావుంటుంది.

Share This Video


Download

  
Report form