YSR Congress Party Nagari MLA said that she will not join Janasena Party.
#YSRCongressParty
పీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా సోమవారం నిప్పులు చెరిగారు. ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు ఢిల్లీలో ఎలా తాకట్టు పెట్టారో రుజువైందని, ఢిల్లీకి వెళ్లి భూకంపాన్ని సృష్టిస్తానని చెప్పిన ఆయన తన మీడియాలో తొడగొట్టి సవాల్ చేసిన చంద్రబాబు, అక్కడకు వెళ్లి తోక ముడిచి పారిపోయారని రోజా అన్నారు. ఈ రోజు జగన్ బీజేపీతో లాలూచీపడ్డారని తన మీడియాలో చంద్రబాబు బురద జల్లుతున్నారని, కానీ నీతి ఆయోగ్‌లో సీఎం ఏం చేశారో చూస్తే అర్థమవుతోందన్నారు.
నాలుగేళ్లుగా ఎన్డీయేలో ఉండి, అధికారం అనుభవించి, ఓటుకు నోటులో దొరికిపోయి, అవినీతితో రాష్ట్రాన్ని దోచుకున్నారని చంద్రబాబుపై రోజా మండిపడ్డారు. తనపై అవినీతి కేసులు విచారణకు రాకుంటే చాలని చంద్రబాబు అనుకున్నారని, కానీ ఇప్పుడు ఎన్డీయే నుంచి బయటకు వచ్చి అన్యాయం చేసిందని చెబుతున్నారని, ఇటీవల ఢిల్లీలో ప్రధాని ఇంటిని ముట్టడించేందుకు వెళ్లి ముందే మీడియాకు చెప్పి అరెస్టు డ్రామాలు ఆడారన్నారు. మోడీకి షేక్ హ్యాండ్ ఇస్తూ చంద్రబాబు వెకిలి నవ్వు నవ్విన ఫోటో బయటకు రాగానే ప్రజలు ఆయన తీరును అర్థం చేసుకున్నారని రోజా చెప్పారు. ఇప్పుడు జాతీయ మీడియా కూడా చంద్రబాబు తీరును తప్పుబట్టిందని, అందుకే నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా పారిపోయారన్నారు.నీతి ఆయోగ్‌ను బహిష్కరించాలన్న నలుగురు సీఎంలు మోడీని చూడగానే నమస్కరించారని, నవ్వుతూ సరెండర్ అయిపోయిన విషయం కళ్లారా చూశామన్నారు.