2019 కవాసకి నింజా 1000 ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. కవాసకి మోటార్స్ ఇండియా విభాగం నింజా 1000 2019 మోడల్‌ను దేశీయ విపణిలోకి లాంచ్ చేసింది. సరికొత్త 2019 కవాసకి నింజా 1000 ప్రారంభ ధర రూ. 9.99 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
2019 కవాసకి నింజా 1000 బైకులో కాస్మొటిక్స్ పరంగా కొద్దిగా మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే, నింజా 1000లో సాంకేతికంగా ఎలాంటి మార్పులు జరగలేదు. కవాసకి నింజా 1000 బ్ల్యాక్ మరియు గ్రీన్ రెండు కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతోంది.
కవాసకి ఇండియా ప్రస్తుతం నింజా 1000 మోటార్ సైకిల్ విడి భాగాలను జపాన్ నుండి సెమీ-నాక్డ్-డౌన్ యూనిట్‌గా దిగుమతి చేసుకొని పూనే ప్లాంటులో అసెంబుల్ చేసి విక్రయిస్తోంది.
Read more at: https://telugu.drivespark.com/two-wheelers/2018/new-kawasaki-ninja-1000-india-launch-price-rs-9-99-lakh-specifications-features-images/articlecontent-pf77657-012185.html
#Kawasaki #KawasakiNinja1000 #Kawasaki1000
Source: https://telugu.drivespark.com/