telangana tdp farmer senior leader motkupalli narasimhulu planning tour in andhra pradesh. he wants to conduct several public meetings there in andhra against chandrababu naidu. bjp and ycp parties are co-operating for motkupalli tour in ap. have to wait and see how far the tdp followers bear motkupalli tour in ap against tdp.
#motkupallinarasimhulu
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు జాతకం ఒక్కసారిగా మారిపోయింది. చంద్రబాబు పైన ఆయన చూపించిన ప్రతాపానికి ఇతర పార్టీల నుండి ' పెద్దమొత్తంలో ' ఆదరణ లభించినట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబుతో విభేదించి పార్టీనుండి సాదాసీదాగా బయటకు వస్తే ఇంత సంచలనం అయ్యి ఉండేది కాదేమో..!! చంద్రబాబును కడుపునిండా, కసి తీరా దూషించినందుకు మోత్కుపల్లి నర్పింహులు ఇతర పార్టీల నేతల 'దృష్టి'ని ఆకర్షించగలిగారు.,ఇంటి వరకు రప్పించుకోగలిగారు. ఇతర పార్టీల నేతలు ఇంటి వరకు వస్తే అందులో వింతేముంది అని అనుకోవచ్చు..! అసలు మతలబు అందులోనే దాగుంది. మోత్కుపల్లి ఇంటికి చక్కర్లు కొడుతున్న నాయకుల అంతరార్థం మరోలా ఉంది.
శత్రువును చావు దెబ్బకొడుతున్న మరో శత్రువుని మిత్రుడిగా మార్చుకుంటే అందులో ఉన్న కిక్కే వేరబ్బా అన్న చందంగా వ్యవహరిస్తున్నారు మోత్కుపల్లిని కలిసిన రాజకీయనేతలు. మోత్కుపల్లికి చంద్రబాబు పైన ఉన్న ఆగ్రహం అంత తొందరగా చల్లారకుండా ఉండేందుకు అనేక 'తాయిలాలు' సిద్దం చేసి మోత్కుపల్లకి చేరవేసినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా మోత్కుపల్లితో ఎలాంటి సంభందంలేని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా ఆయనను మచ్చికచేసుకుని 'మర్యాదలు' చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి.