A fortuitous Diego Costa goal helped Spain overcome a dogged Iran to secure a 1-0 win in their World Cup Group B clash in Kazan. Carlos Queiroz's side produced a defensive masterclass to reduce Spain to nothing more than half-chances during a hugely frustrating opening 53 minutes for the 2010 champions.
#fifaworldcup2018
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలో స్పెయిన్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. టోర్నీలో భాగంగా గ్రూప్ బిలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 1-0 తేడాతో ఇరాన్ ఘన విజయం సాధించింది. టోర్నీలో స్పెయిన్‌కు ఇది రెండో విజయం కావడం విశేషం.
మరోవైపు తాజా విజయంతో స్పెయిన్‌కు ఖాతాలోకి మొత్తం 4 పాయింట్లు వచ్చాయి. అంతకముందు ఇదే గ్రూపులోని మొరాకో జట్టుపై పోర్చుగల్ గెలవడంతో గ్రూపు నుంచి ఏ జట్టు క్వార్టర్స్‌కు అర్హత సాధిస్తుందోనన్న టెన్షన్ ఏర్పడింది. టోర్నీలో భాగంగా మొరాకోతో జరిగిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన స్పెయిన్, రెండో మ్యాచ్‌లో ఇరాన్‌పై విజయం సాధించిన తన క్వార్టర్స్‌కు వెళ్లే అవకాశాన్ని మరింత మెరుగుపరచుకుంది.
ఇరు జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో ఏ జట్టు గోల్‌ని నమోదు చేయలేకపోయింది. మ్యాచ్ అరంభం నుంచీ దూకుడుగా ఆడుతున్న స్పెయిన్ ఆటగాళ్లను ఇరాన్ డిఫెండర్లు తెలివిగా అడ్డుకున్నారు. అయితే ఆట 54వ నిమిషంలో డీగో కోస్టా తొలి గోల్ నమోదు చేసి స్పెయిన్‌కు ఆధిక్యాన్ని అందించాడు.