Raphael Varane insists France remain calm after their unconvincing win against Australia as they prepare to face Peru at the World Cup.
ఫిఫా ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ నాకౌట్‌కు చేరుకుంది. గ్రూపు-సి లో పెరూతో జరిగిన మ్యాచ్‌లో 1-0తో విజయం సాధించింది. పెరూతో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆరంభం నుంచే ఇరు జట్లు పోటాపోటీగా గోల్ కోసం ప్రయత్నించాయి. 34వ నిమిషంలో ఫ్రాన్స్ మిడ్‌ఫీల్డర్ బప్పే గోల్ కొట్టి ఫ్రాన్స్‌కి ఆధిక్యత అందించాడు. ఆ తర్వాత మ్యాచ్ ద్వితీయార్థంలో ఎవరూ గోల్ చేయకపోవడంతో ఫ్రాన్స్ 1-0తో గెలిచి నాకౌట్‌కు చేరింది.
ఫిఫా ప్రపంచకప్ 2018 సీజన్‌లో వరుసగా రెండో విజయం సాధించిన ఫ్రాన్స్ జట్టు నాకౌట్ దశకి చేరుకుంది. దీంతో.. టోర్నీలో వరుసగా రెండో ఓటమిని చవిచూసిన పెరూ జట్టు పోరాటం దాదాపు ముగిసింది. మ్యాచ్ 34వ నిమిషంలో గోల్ చేసిన కైలియన్ ఫ్రాన్స్‌కి 1-0తో ఆధిక్యం అందించాడు.
మ్యాచ్ 82వ నిమిషంలో గిరౌడ్ స్థానంలో ఉస్మన్ డెంబెలె సబ్‌స్టిట్యూట్‌గా దిగాడు. పెరూ జట్టుకు చెందిన గురెరో ఫ్రీ కిక్‌ను గోల్ చేయడానికి ఆలస్యం చేయడంతో లాభం లేకుండా పోయింది