FIFA World Cup 2018 : Brazil Win Against Costa Rica

Oneindia Telugu 2018-06-23

Views 203

Philippe Coutinho and Neymar struck late as after keeping Brazil at bay for 90 minutes, Costa Rica conceded two goals in six minutes to go down 0-2 in the Group E encounter at the Krestovsky Stadium and crash out of FIFA World Cup 2018 . As part of leadership rotation policy, it was Thiago Silva, who lead Brazil. The Paris Saint-Germain defender last wore the armband during the 0-1 friendly loss to Argentina, which was the only loss suffered by Tite's Brazil in the last 22 games.
#FIFAWorldCup2018

ఆఖరి క్షణాల్లో అనూహ్యంగా గోల్ సాధించి ఘన విజయాన్ని నమోదు చేసుకుంది బ్రెజిల్ జట్టు. ఈ ఏడాది ఫిఫా ప్రపంచకప్‌ను పేలవంగా ఆరంభించిన ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ బ్రెజిల్ టోర్నీలో దూకుడు పెంచింది. గ్రూప్-ఈలో భాగంగా స్విట్జర్లాండ్‌తో తొలి మ్యాచ్‌ను బ్రెజిల్ 1-1తో డ్రాగా ముగించిన విషయం తెలిసిందే.
గ్రూప్-ఈలో భాగంగా కొస్టారికాతో మ్యాచ్‌లో ఛాంపియన్ ఆటను ప్రదర్శించింది. ప్రత్యర్థి నిలువరించినా ఆఖరి నిమిషం వరకు పోరాడి 2-0గోల్స్‌తో విజయం సాధించింది. కోస్టారికా ఫిఫా ర్యాంకు 25. చిన్న దేశమే కానీ ఆటలో తక్కువేం కాదని కోస్టారికా నిరూపించింది. రెండో ర్యాంకు సాంబా జట్టును ముప్పతిప్పలు పెట్టింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు గోల్ చేసేందుకు పోటీపడ్డాయి. బ్రెజిల్‌పై వ్యూహాలను చిత్తుచేస్తూ కోస్టారికా గట్టి పోటీనిచ్చింది. తొలి సెషన్‌లో ఎవరూ గోల్ చేయకపోవడంతో 0-0తో ముగిసింది. రెండో సెషన్ కొంత ఆసక్తికరంగా సాగింది. 72వ నిమిషంలో వచ్చిన గొప్ప అవకాశాన్ని నెయ్‌మార్ వృథా చేశాడు. అతడు తన్నిన బంతి గోల్‌పోస్ట్‌కు పక్కగా వెళ్లింది. బ్రెజిల్ ప్రత్యర్థి పోస్ట్‌పై గోల్‌కు ప్రయత్నించే క్రమంలో ఇరు జట్ల ఆటగాళ్లు గాయాలపాలయ్యారు.

Share This Video


Download

  
Report form