Jamba Lakidi Pamba Movie Review జంబలకిడి పంబ మూవీ రివ్యూ

Filmibeat Telugu 2018-06-22

Views 27

The first look poster of Srinivas Reddy starrer Jamba Lakidi Pamba was released today by actor Naresh Vijaya Krishna.

సుమారు రెండు దశాబ్దాల కాలంగా తనదైన స్టయిల్‌లో తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తున్నారు కమెడియన్, హీరో శ్రీనివాస్ రెడ్డి. రెగ్యులర్‌గా హస్యనటుడిగా మెప్పిస్తూనే, మంచి కథ దొరికితే హీరోగా వెండి తెరపైన మెరుస్తున్నారు
తాజాగా జతకట్టి జంబలకిడి పంబ చిత్రంలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జంబలకిడి పంబ అంటే కామెడీకి ట్రేడ్ మార్క్‌గా నిలిచిన పాత చిత్రం గుర్తుకు వస్తుంది. ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వం వహించిన జంబలకిడి పంబ టైటిల్‌తో జూన్ 22న రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
రుణ్ (శ్రీనివాస్‌రెడ్డి), పల్లవి (సిద్ది ఇద్నాని) ప్రేమించి పెళ్లి చేసుకొంటారు. అయితే కొన్నేళ్ల తర్వాత వారి మధ్య వ్యక్తిగత అభిప్రాయాలు తలెత్తుతాయి. అమితంగా ప్రేమించుకొన్న వారి మధ్య మనస్పర్థలు చోటుచేసుకొంటాయి. దాంతో విడిపోవాలని విడాకులకు దరఖాస్తు చేసుకొంటారు. లాయర్ హరిశ్చంద్ర ప్రసాద్ విడాకులు ఇప్పించడంలో సిద్ధహస్తులు. 99 మంది దంపతులకు విడాకులు ఇప్పించి 100 కేసుగా వరుణ్, పల్లవి విడాకుల కేసును టేకప్ చేస్తారు. కానీ హరిశ్చంద్రప్రసాద్ జీవితంలో చేసుకొన్న ఊహించని ఓ సంఘటనతో వరుణ్, పల్లవి జీవితాలు తారుమారవుతాయి.

Share This Video


Download

  
Report form