The first look poster of Srinivas Reddy starrer Jamba Lakidi Pamba was released today by actor Naresh Vijaya Krishna. In an event held Sarathi Studios, the poster was unveiled in the presence of actor Ali and director Maruthi Dasari.
జయమ్ము నిశ్చయంబు రా, ఆనందో బ్రహ్మ చిత్రాలు సాధించిన విజయాల తర్వాత హీరోగా ప్రస్తుతం జంబలకిడి పంబలో నటిస్తున్నాను. గత చిత్రాల్లో కథ నచ్చడంతోనే హీరోగా చేశాను. ఈ సినిమాలో కూడా దర్శకుడు చెప్పిన స్టోరి కారణంగానే ఈ చిత్రంలో నటించాను. ఇంట్లో నైటీలు వేసుకొని మెంటల్‌గా ప్రిపేర్ అయ్యాను. మన ఇంట్లోకి కొత్త వ్యక్తి వచ్చారంటూ నా కూతురు కూడా చాలా గమ్మత్తుగా కామెంట్ చేసింది.
పాత జంబలకిడి పంబ చిత్రంలో ఓ ఊరులోని ప్రజలంతా అంటే ఆడవాళ్లు మగవాళ్లుగా.. మగవాళ్లు.. ఆడవాళ్లుగా మారిపోతారు. కానీ ఈ చిత్రంలో జంబలకిడి పంబ అనే మంత్రం ద్వారా నేను, హీరోయిన్ మాత్రమే మారిపోతాం. హీరోయిన్ సిద్ది ఇద్నానీ కూడా బాగా నటించింది. ఈ సినిమాకు ఆమె నటన హైలెట్ అని చెప్పవచ్చు.
కమెడియన్ పాత్రలు చేస్తూనే మంచి కథలు వస్తే హీరోగా నటిస్తున్నాను. హీరోగప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా అరవింద సమేత, శ్రీనువైట్ల, రవితేజ కాంబినేషన్‌లో వస్తున్న అమర్ అక్బర్ ఆంథోని, వెంకటేష్, వరుణ్ తేజ్ ఎఫ్2, నారా రోహిత్ రూపొందించే వీరభోగ వసంత రాయలు, పంతం చిత్రాల్లో నటిస్తున్నాను. కోన వెంకట్ ఓ సినిమా చేద్దామని అన్నారు. గీతాంజలి2 సినిమా గురించి క్లారిటీ లేదు.