Fifa World cup 2018 : Maradona Attracts Spotlight With Sweary Celebration

Oneindia Telugu 2018-06-27

Views 230

Diego Maradona enjoyed the late winner against Nigeria that kept Argentina in the World Cup, the football legend caught celebrating with an offensive gesture in the stands.

మెస్సీ అభిమానుల ప్రార్ధనలు ఫలించాయి. నాకౌట్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం నైజీరియాతో చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్‌‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌కి ముందు టోర్నీలో అర్జెంటీనా ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ డ్రా, మరొక మ్యాచ్‌లో ఓటమి పాలైంది. దీంతో అర్జెంటీనా జట్టు నాకౌట్‌కు చేరుతుందా? లేదా అన్న ప్రశ్న మెస్సీ అభిమానులను వేధించింది. దీంతో మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు నాకౌట్‌కు చేరాలని ప్రార్ధనలు చేశారు. అయితే చివరకు అభిమానుల ప్రార్ధనలు ఫలించి మెస్సీ సారథ్యంలోని అర్జెంటీనా జట్టు నైజీరియాపై గెలిచి నాకౌట్‌కు అర్హత సాధించింది. నాకౌట్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రాన్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ జూన్ 30న కజన్ స్టేడియంలో జరగనుంది. సెయింట్ పీటర్స్‌బర్గ్ వేదికగా నైజీరియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా విజయం సాధించడంతో స్టేడియంలో పుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు.

Share This Video


Download

  
Report form