Virat Kohli-led Team India can displace Pakistan from the top spot in the ICC T20I Rankings if they manage to win all their upcoming five encounters.
ఇప్పటివరకు ఐర్లాండ్‌తో టీమిండియా మూడు వన్డేలు, ఒక టీ20 ఆడగా అన్నింట్లోనూ టీమిండియాదే విజయం. ఐర్లాండ్‌తో జరిగే ఈ సిరీస్‌ను గెలుచుకుని ఇంగ్లాండ్ పర్యటనను ఘనంగా ఆరంభించాలని కోహ్లీసేన చూస్తోంది. ఇంగ్లాండ్ సిరీస్‌కు ముందు ఐర్లాండ్ సిరీస్‌ను భారత్ చిన్నపాటి సన్నాహకంగా భావిస్తోంది.
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న కోహ్లీసేన టీ20ల్లో కూడా నంబర్‌వన్ స్థానంపై కన్నేసింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ల్లో కోహ్లీసేన విజయం సాధిస్తే దాయాది దేశమైన పాకిస్థాన్‌ను వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్‌తో సిరీస్‌ను భారత్ తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు.
చిన్న జట్టే అయినప్పటికీ, ఆ జట్టులో కూడా కెవిన్, పోర్టర్‌ఫీల్డ్, స్టిర్లింగ్, డాక్రెల్ లాంటి నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరిస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జులై 3 నుంచి టీ20 సిరిస్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడనుంది.