తెలుగు తెరపై ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఎన్టీఆర్ బయోపిక్‌లో హీరోయిన్ ఎవరనే విషయంపై సందిగ్ధత కొనసాగుతున్నది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే అధికారికంగా క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్‌కు విద్యాబాలన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ముందు ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకొన్నది. విద్యాబాలన్‌ను కలువడానికి బాలకృష్ణ వెళ్లడం మీడియా వర్గాల్లో సెన్సేషన్‌గా మారింది.
ఎన్టీఆర్ భార్య పాత్రలో నటించే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ముందు విద్యాబాలన్ పలుమార్లు పునరాలోచనలో పడ్డారట. దాంతో పాత్రపై క్లారిటీ ఇచ్చేందుకు స్వయంగా విద్యాబాలన్ ఇంటికి బాలకృష్ణ వెళ్లడం కూడా జరిగింది. తన తల్లి పాత్రకు సంబంధించిన అనేక విషయాలను విద్యాబాలన్‌కు పూసగుచ్చినట్టు చెప్పినట్టు సమాచారం.
తన తల్లి బాసవతారకం పాత్ర గురించి బాలకృష్ణ వెల్లడించిన విషయాలు విని విద్యాబాలన్ ఎమోషనల్ అయినట్టు తెలిసింది. దాంతో ఆ పాత్రను ఎలాగైనా చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు.
Vidya Balan has been approached to play a key role in Telugu biopic of actor-politician NTR. While NTR's son Balakrishna will play the role of his father, Vidya Balan was asked to play NTR's wife Basavatarakam. As Vidya Balan was taking some time to give her green signal to the offer, she had a surprise guest Balakrishna at her Mumbai residence.