కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తన తొలిబడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇందులో రైతులకు సంబంధించి వారు తీసుకున్న పంటరుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది 31 డిసెంబరు వరకు రైతులు తీసుకున్న రుణాలన్నిటినీ మాఫీ చేస్తున్నట్లు కుమారస్వామి తెలిపారు. అంతేకాదు రుణాలు పొంది క్రమం తప్పకుండా ఎవరైతే రుణాలు తిరిగి కట్టారో అలాంటి రైతులకు 25వేలు జమ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల ప్రచార సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పినట్లుగానే హామీని నెరవేరుస్తున్నానని కుమారస్వామి చెప్పారు. రుణాలను రూ.2లక్షలకు పరిమితం చేసేందకు తాను నిర్ణయించుకున్నట్లు కుమారస్వామి వెల్లడించారు. దీంతో రైతులకు 34వేల కోట్ల రూపాయలు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. కొత్త రుణాలు కూడా రైతులు పొందొచ్చని ఈ సందర్భంగా స్వామి తెలిపారు. కొత్త రుణాలను పొందేందుకు క్లియరెన్స్ సర్టిఫికేట్లు జారీ చేస్తామని చెప్పారు.
Karnataka chief minister H D Kumaraswamy on Thursday announced a much-expected farm loan waiver for all defaulting loans up to December 31, 2017.Farmers who repaid the loan within time, as an encouragement to the non-defaulting farmers, Swamy have decided to credit the repaid loan amount or Rs 25,000 whichever is less.
#kumaraswamy
#karnatakabudget
#loanwaiver
#agriculturalloans
#siddaramaiah
#farmers