బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో కొత్త సినిమా సోమవారం హైదరాబాద్ నానక్‌రాం గూడలోని రామానాయుడు స్టూడియోలో ప్రారంభం అయింది. మాస్ మసాలా ఎంటర్టెనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్. సోనూ సూద్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ ప్రారంభోత్సవానికి దర్శకుడు వివి వినాయక్, శ్రీవాస్, మాజీ మంత్రి దానం నాగేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి వినాయక్ క్లాప్ కొట్టగా, శ్రీవాస్ కెమెరా స్విచన్ చేశారు. తొలి సన్నివేశానికి తేజ దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
సినిమా ప్రారంభంతో పాటు ప్రత్యేకంగా వేసిన సెట్లో రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు. హీరోయిన్ కాజల్‌కు తేజ దర్శకత్వంలో ఇది 3వ సినిమా కాగా, బెల్లంకొండ శ్రీనివాస్‌తో రెండో సినిమా. ఈ చిత్రంలో సోనూ సూద్‌తో పాటు అభిమన్యు సింగ్ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.