Sarrainodu gets all time Indian cinema in Youtube. Creates new record in terms fo views and likes
#Sarrainodu
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. డాన్స్, నటన, తన మేకోవర్ విషయంలో బన్నీ ప్రతి చిత్రంలోనూ అభిమానులని ఉర్రూతలూగిస్తుంటాడు. బన్నీకి తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా మంచి క్రేజ్ ఉంది. సరైనోడు చిత్రం బన్నీ కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ గా నిలిచింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మాస్ ప్రేక్షకులని విపరీతంగా అలరించింది. ఈ చిత్రాన్ని గత ఏడాది మే నెలలో హిందీలో డబ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేశారు. మరే ఇండియన్ సినిమాకు సొంతం కానీ రికార్డుని సరైనోడు చిత్రం అందుకుంది.
సరైనోడు చిత్రం అత్యధిక యూట్యూబ్ వ్యూస్ సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు సృష్టించింది. 200 మిలియన్ల వ్యూస్ తో ఈ చిత్రం దూసుకుపోతుండడం విశేషం. ఈ రికార్డు ఇంత వరకు మరే ఇండియన్ హీరో సినిమాకు దక్కలేదు.