Sri Reddy Goes Moves Chennai To Nadigar Sangam

Filmibeat Telugu 2018-07-16

Views 1

తమిళ లీక్స్ పేరుతో తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఏఆర్ మురుగదాస్, రాఘవ లారెన్స్, సుందర్ సి, శ్రీకాంత్ లాంటి స్టార్లపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి తనను మోసం చేసిన వారిపై కంప్లయింట్ చేసేందుకు చెన్నై వెళ్లాలని నిర్ణయించుకుంది. శ్రీరెడ్డి చెన్నై వస్తున్న నేపథ్యంలో నడిగర్ సంఘం కార్యదర్శి హోదాలో ఉన్న నటుడు విశాల్ రంగంలోకి దిగారట. ఈ నేపథ్యంలో తమిళ సినీ పరిశ్రమలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చర్చనీయాంశం అయింది.
సోమవారం ఉదయం ఫేస్ బుక్ పేజీలో వీడియో పోస్టు చేసిన శ్రీరెడ్డి.... తాను చెన్నై వెళుతున్నట్లు తెలిపారు. అక్కడికి వెళ్లి కొన్ని పనులు చేయాల్సి ఉంది. అదే విధంగా నన్ను మోసం చేసిన వారిపై ఫిర్యాదు చేయాల్సి ఉంది... అని శ్రీరెడ్డి తెలిపారు.
నాకు టాలీవుడ్లో న్యాయం జరుగలేదు. కోలీవుడ్లో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. అక్కడ మహిళలకు మంచి గౌరవం ఉంటుంది. అక్కడైనా నాకు న్యాయం జరుగుతుందని వెళుతున్నాను. భవిష్యత్తులో నాకు సినిమా అవకాశాలు వస్తాయో? రావో నిజంగా నాకు తెలియదు. ఆ దేవుడికే తెలుసు. నాలాగా ఏ ఆడపిల్లా బాధపడకూడదనే ఇదంతా చేస్తున్నాను. నా జీవితంలో జరిగిన సంఘటనలు తెలుసుకుని అయినా అమ్మాయిలు కళ్లు తెరవాలి... అని శ్రీరెడ్డి తెలిపారు.

Share This Video


Download

  
Report form