నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారికి థాంక్స్..సింగర్ సునీత.

Filmibeat Telugu 2018-07-20

Views 9

Sunitha laughs about her marriage rumours. Sunitha marriage rumour spreads like a wave.

సింగర్ సునీత పేరు తెలియని సినీ అభిమాని ఉండరు. మధురమైన గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆమె పేరు ప్రతిష్టలు సంపాదించారు. సెలెబ్రిటీలు రూమర్స్ బారీన పడడం సహజమే. కానీ ఆ రూమర్స్ మీడియాలో, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయితే వారికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. అదే పరిస్థితిని సునీత ఎదుర్కొన్నారు. సునీత వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తుండడంతో సోషల్ మీడియా లైవ్ లో క్లారిటీ ఇచ్చారు. చిరునవ్వుతోనే ఆమె ఈ రూమర్స్ పై తన స్పందన తెలియజేశారు. వరుసగా మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తుండడంతో ఈ వార్తలపై క్లారిటీ ఇవ్వాలని అనిపించింది. ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నా.. నాకు అటువంటి ఆలోచన ప్రస్తుతం లేదని సునీత అన్నారు. నాకు సంబందించిన రూమర్ గురించి ఈ స్థాయిలో మాట్లాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోయా. అదే సమయంలో నాపై ఇంత అభిమానం ఉందా అని కూడా అనిపించింది. నేను పెళ్లి చేసుకుని సెటిల్ కావాలని ఇంత మంది కోరుకుంటున్నందుకు కృతజ్ఞతలు. కానీ ప్రస్తుతం నాకు ఆ ఆలోచన లేదు. దయచేసి ఇటువంటి రూమర్స్ సృష్టించవద్దు. భవిషత్తులో ఇటువంటిది ఏదైనా ఉంటే మీ అందరి విషెష్ తోనే జరుగుతుంది. ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదు అంటే.. తాను ఏ విషయంలోనూ ఎవ్వరికీ క్లారిటీ ఇవ్వవలసిన అవసరం లేదు. నాకు నంది అవార్డు, ఫిలిం ఫేర్ అవార్డు వచినప్పుడు ఇన్ని మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ రాలేదు. వెబ్ సైట్స్ లో కూడా రాలేదు. ఈ పరిస్థితి నాకు మాత్రమే కాదు.. ప్రతి సెలెబ్రిటికి ఉండేదే అని సునీత పేర్కొన్నారు. నాజీవితంలో విడాకులు జరిగి చాలా కాలం అవుతోంది. ఏమి చేసినా లీగల్ గానే చేస్తా. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ఆ హక్కు నాకు ఉంది. మరోమారు చెబుతున్నా అలాంటిదేసమైనా ఉంటె మీ విషెష్ తోనే పెళ్లి చేసుకుంటా. ప్రస్తుతం వస్తున్న వార్తలకు ఆధారం లేదు. నా గురించి నేను చెబితేనే ఆ వార్తకు ఆధారం ఉన్నట్లు అని సునీత పేర్కొన్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS