Virat Kohli's flexible approach to batting and relentless pursuit of excellence enabled the Indian captain to script a spectacular turnaround and score his maiden hundred on English soil, said assistant coach Sanjay Bangar. England finished the day two of the first Test 22 runs ahead after India were bowled out for 274 runs in the first innings with Kohli making a memorable 149. The defining knock exorcised the ghosts of 2014 tour of England where Kohli could only muster 134 runs in 10 innings at an average of 13.4.
#ViratKohli
#England
#RavichandranAshwin
#century
#India
#alastaircook
ఇంగ్లాండ్ గడ్డపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వీరోచిత సెంచరీని సొంతం చేసుకున్నాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో సహచరులందరూ వరుసగా పెవిలియన్ చేరుతున్నా.. మొక్కవోని దీక్షతో బ్యాటింగ్ చేసిన విరాట్ కోహ్లి 172 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. కెరీర్‌లో కోహ్లీకి ఇది 22వ టెస్టు సెంచరీ కాగా.. ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో ఈ భారత కెప్టెన్‌కి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
కోహ్లీ.. ఇంగ్లాండ్ గడ్డపై చేసిన సెంచరీ కావడంతో ప్రత్యేక సంబరాలు చేసుకున్నాడు. స్టోక్స్ బంతిని పాయింట్ దిశగా బౌండరీ దాటించి సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి స్టేడియంలో ఉన్న అనుష్క శర్మ వైపు తిరిగి తన మెడలో ఉన్న రింగ్‌ను తీసి ముద్దాడాడు. బ్యాట్‌తో గాల్లోకి ముద్దులు విసిరి ఆనందాన్ని వ్యక్తం చేశాడు. గతంలో అతనిని విమర్శించిన గడ్డపైనే సెంచరీ చేయడంతో కోహ్లీ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.