Tension has prevail at CM Chandra babu house in Undavalli on Monday. The Special Protection Force Constables together with their family members took up the dharna at the CM Chandrababu's residence for remove them from their jobs. The tension broke out when police tried to the People.
ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసం వద్ద సోమవారం ఉద్రిక్తత నెలకొంది. అన్యాయంగా ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్స్ వారి కుటుంబ సభ్యులతో కలసి సీఎం చంద్రబాబు నివాసం వద్ద ధర్నా చేపట్టారు.
ఎస్పీఎఫ్ నుంచి 80 మందిని అకారణంగా సర్వీసుల నుంచి తొలగించారని, ఉద్యోగాలు కోల్పోవడంతో తమ కుటుంబాలు మూడేళ్లుగా రోడ్డున పడ్డామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలిసి తమ గోడు వెళ్లబోసుకుందామని వస్తే వస్తే అడ్డుకోవడం దారుణమని స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కుటుంబాలు వాపోయారు.
#andhrapradesh
#amaravathi
#cmchandrababu
#residence
#tension