Former Indian captain Sourav Ganguly said that a coach should take a back seat in cricket as it is a captain's game, unlike football."I think the coach has to take a back seat in cricket. It's not like football. A lot of the current cricket coaches start to believe that I'm going to run a cricket team like a football team.
క్రికెట్ జట్టులో కెప్టెన్.. కోచ్‌ల పాత్ర ఏమిటో గంగూలీ మరోసారి గుర్తు చేశారు. ఫుట్‌బాల్‌లో మాదిరి క్రికెట్లో కోచ్‌లు జట్లపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటే కుదరదంటూ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. 'క్రికెట్ ఫుట్‌బాల్‌లా కాదు. ప్రస్తుతం క్రికెట్లో చాలామంది కోచ్‌లు తమ జట్లను ఫుట్‌బాల్ టీంల తరహాలో నడిపించాలని చూస్తున్నారు. కానీ క్రికెట్ కెప్టెన్ ఆట. కోచ్‌లు వెనుక సీట్లో ఉండాలి. అది చాలా కీలకమైన విషయం' అని అతను అన్నాడు.