భారత సంతతికి చెందిన అమెరికన్ నటి, మోడల్, టీవీ హోస్ట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పద్మాలక్ష్మి తన టీనేజ్‌లో జరిగిన ఓ చేదు సంఘటన గురించి మీడియాకు వెల్లడించారు. న్యూయార్క్ టైమ్‌కు రాసిన కాలమ్‌లో.... 16 ఏళ్ల వయసులోనే తననపై అత్యాచారం జరిగిందని, 23 ఏళ్ల బాయ్‌ఫ్రెండ్ తనపై అఘాయిత్యం చేశాడని తెలిపారు.
తనపై జరిగిన తొలి లైంగిక దాడి గురించి ఆమె వివరిస్తూ... నా వయసు అపుడు 16 సంవత్సరాలు. లాస్ ఏంజిలెస్ లోని ఓ మాల్‌లో కలిసిన 23 ఏళ్ల వ్యక్తితో డేటింగ్ మొదలు పెట్టాను. స్కూల్ పూర్తయిన తర్వాత నేను ఆ మాల్‌లో యాక్ససెరీస్ కౌంటర్లో పని చేసేదాన్ని. అతడు హై ఎండ్ మెన్స్ స్టోర్లో పని చేసేవాడు. డేటింగ్ మొదలు పెట్టిన కొన్ని రోజులకే నాపై అత్యాచారం జరిగింది అని పద్మాలక్ష్మి గుర్తు చేసుకున్నారు.