Navaratri is a nine night festival that honors the Mother Goddess in all her manifestations, including Durga, Lakshmi and Saraswati. It's a festival full of worship and dance. The festival culminates with Dussehra, the victory of good over evil, on the tenth day.
#Navaratri
#dussehra2018
#Lakshmi
#Saraswati
దేవీ నవరాత్రులలో దేవీ అలంకారాలు ఒక్కోరోజు ఒక్కో విధంగా ఉంటాయి. దేవీ వివిధ అవతారాలకు ప్రతిరోజు ప్రసాదం (నివేదన) విభిన్నంగా ఉంటుంది. దసరా అనే పేరు 'దశహరా'కు ప్రతిరూపమని కొందరంటారు. అంటే పాపనాశని అని అర్థం. అమ్మవారి అలంకారమునకు రంగులు వేర్వేరుగా ఉంటాయి. దసరా పండుగ అనగానే దేశం నలుమూలలా చిన్న, పెద్ద అందిరిలోనూ భక్తి ప్రపత్తులతో పాటు ఉత్సహం, ఉల్లాసాలు తొణికిసలాడుతాయి. నవరాత్రులలో దేవికి విశేషపూజలు చేయటంతోపాటు బొమ్మల కొలువులు, అలంకారాలు, పేరంటాల వంటి వేడుకలను జరుపుకుంటుంటారు. విజయదశమి పేరున చేసుకునే ఈ పండుగ ఆశ్వీయుజ మాసంలో వస్తుంది ఆశ్వయుజ శుద్ధపాడ్యమితో ప్రారంభమై తొమ్మిది రోజులూ మంత్ర దీక్షతో దేవీ నవరాత్రులు జరుపుతారు. శరదృతువులో వచ్చే ఈ దేవీ నవరాత్రులనే శరన్నవరాత్రులు అని కూడా అంటారు.