Mega Hero Saidhram Tej response on Aravindha Sametha movie. Tej praises Trivikram Srinivas and NTR.
#aravindhasametha
#jrntr
#thaman
#poojahegde
అరవింద సమేత చిత్రానికి ప్రముఖుల నుంచి ప్రశంసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అరవింద సమేత చిత్ర విజయంపై దర్శక ధీరుడు రాజమౌళి చిత్ర యూనిట్ ని అభినందించారు. నితిన్ ప్రశంసలు కురిపించాడు. తాజాగా మెగా హీరో సాయిధరమ్ తేజ్ అరవింద సమేత విజయం పట్ల తన స్పందన తెలియజేశాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఇప్పటివరకు చిత్రాలు తీశారు. అరవింద సమేత చిత్రంతో తొలిసారి ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న కథని ఎంచుకోవడంతో ఈ చిత్రం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంచనాలకు తగ్గట్లుగానే ఎన్టీఆర్ తన నటనతో అదరగొట్టగా, త్రివిక్రమ్ తన దర్శకత్వ ప్రతిభని మరో మారు నిరూపించుకున్నారు.