Aaron Finch ruled Stanlake out of the final match with him injuring his ankle on the boundary line while having a catching practice as part of the warm-up for the Melbourne T20I. Mitchell Starc has been called to replace Billy Stanlake in the Australian squad for the third and final T20I against India.
#IndiavsAustralia3rdT20I
#MitchellStarc
#BillyStanlake
#INDVSAUS
#AaronFinch
మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా టీమిండియాతో జరిగే మూడో టీ20కి పేసర్ మిచెల్ స్టార్క్‌ను ఎంపిక చేశారు. శుక్రవారం వార్మప్ సెషన్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా బిల్లీ స్టాన్‌లేక్‌కు చీలమండ గాయం కావడంతో అతడు సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో మిచెల్ స్టార్క్ బరిలోకి దిగుతాడని ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ తెలిపాడు. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 ఆరంభానికి ముందు పేసర్ బిల్లీ స్టాన్‌లేక్ గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో రెండో టీ20కి అతడి స్థానంలో నాథన్ కౌల్టర్ నైల్‌ను తుది జట్టులోకి తీసుకున్నారు. ఇక, సిరిస్ ఫలితాన్ని నిర్ణయించే మ్యాచ్ కావడంతో స్టాన్‌లేక్ స్థానాన్ని మిచెల్ స్టార్క్‌తో భర్తీ చేశారు.