Yuvraj Singh playing his first match of the 2018-19 Ranji Trophy. Yuvraj Singh, who last played for India in June 2017, will also be available for Punjab’s next two matches against Himachal Pradesh and Tamil Nadu.
#IPL2019
#ipl
#YuvrajSingh
#KXIP
#RanjiTrophy
తనెంటో నిరూపించుకుని ఐపీఎల్ 2019వేలంలో చోటు దక్కించుకోవాలని భారత వెటరన్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ గట్టి ప్రణాళికలో ఉన్నాడు. ఈ క్రమంలోనే దేశవాళీ క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. ఏడాదిన్నర కాలంగా టీమిండియాకి దూరమైన యువీ.. ఐపీఎల్ 2018 సీజన్‌లో నిరాశపరచడంతో కింగ్స్ ఎలెవన్ ఫ్రాంఛైజీ అతడ్ని వేలంలోకి విడిచిపెడుతున్నట్లు ఇటీవలే నిర్ణయాన్ని ప్రకటించింది. దీంతో.. యువరాజ్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడ్డాడు.ఫామ్,ఫిట్‌నెస్ లేమితో ఈ ఏడాది సీజన్‌లో ఒక్క దానిలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయిన యువీని 2019 ఐపీఎల్ సీజన్ కోసం డిసెంబరులో జరగనున్న వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయకపోవచ్చనే అనుమానాలు లేకపోలేదు. దీంతో.. ఈ ఆల్‌రౌండర్ కూడా కెరీర్ గురించి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పంజాబ్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ ఆడేందుకు పూనుకున్నాడు. ఇప్పటికే పంజాబ్ ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌తో 2 మ్యాచ్‌లు ఆడింది. వాటికి అందుబాటులో లేని యువరాజ్ సింగ్.. బుధవారం ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌తో జట్టులోకి పునరాగమనం చేయనున్నట్లు తెలుస్తోంది.