Akram told : Of course we would want to see Dhoni in the World Cup, the form is temporary and class is forever. Dhoni is a match winner and I still feel there’s a lot of cricket in him and in England, the team would need Dhoni’s experience.
#dhoni
#2019WorldCup
#WasimAkram
#vvslaxman
#indiancricketteam
డిసెంబర్ 6 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరిస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ వన్డే సిరిస్ కోసం సెలక్టర్లు ఇంకా జట్టుని ప్రకటించలేదు. ఈ వన్డే సిరిస్‌లో గనుక ధోనికి ఎంపిక కాకపోతే వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌లో చోటు దక్కడం కష్టమే. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనిని ఇకపై పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కూడా అభిమానులు చూడలేరు. అయితే, వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ధోని తప్పక ఆడాలని పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సూచించాడు.