The four-day tour game ended in a draw as India scored 211 for two in their second innings in reply to Cricket Australia XI's 544. Vijay scored 129 off 132 balls, racing from 52 to the three-figure mark in the space of 27 balls, including taking 26 runs off one over.
#IndiavsAustralia1stTest
#viratkohli
#MuraliVijay
#RohitSharma
#KLRahul
#PrithviShaw
తొలి టెస్టుకు కేఎల్ రాహుల్‌తో పాటుగా పృథ్వీ షా ఉంటే ఇన్నింగ్స్ శుభారంభం జరుగుతుందని అంతా భావించారు. కానీ, అకస్మాత్తుగా పృథ్వీ షా కాలికి గాయం అవడంతో జట్టు అయోమయంలో పడింది. మరో ఓపెనర్‌గా మురళీ విజయ్‌ను తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో సతమతమవుతుండగానే వార్మప్ మ్యాచ్‌లో విజయ్ విజృంభించి సత్తా చాటాడు. ఆస్ట్రేలియా ఎలెవెన్‌తో ఆదివారం ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో సత్తా చాటాడు. ఈ సెంచరీకి మించిన ఇన్నింగ్స్‌తో టెస్ట్ సిరీస్‌లో విజయ్ దాదాపు ఓపెనర్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు. పృథ్వీ స్థానంలో వచ్చిన విజయ్‌కి రాహుల్ తోడవడంతో చక్కటి భాగస్వామ్యం నెలకొంది. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై విజయ్ ఇలా మాట్లాడాడు. ‘మేం ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లం. అందువల్ల ఒకరిపై ఒకరికి మంచి అవగాహన ఉంది. అతను మంచి వ్యక్తి. తనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ఎప్పుడూ సరదాగా ఉంటుంది. మొదటి టెస్టులోనూ ఇదే ఫాం కొనసాగిస్తామనే నమ్మకం ఉంది' అని అన్నాడు.