Telugu Titans face another defeat against current Zone B leaders Bengaluru Bulls at the Rajiv Gandhi Indoor Stadium in Vizag on Wednesday. Bengaluru Bulls have taken the match 24-37.
#ProKabaddiLeague
#ProKabaddi2018
#TeluguTitans
#BengaluruBulls
వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫామ్‌లోకి వచ్చిన తెలుగు టైటాన్స్ మళ్లీ ట్రాక్ తప్పింది. ప్రొ కబడ్డీ లీగ్‌లో భాగంగా బుధవారం జరిగిన జోన్- బి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 24-37తో బెంగళూరు బుల్స్ చేతిలో ఓడింది. పదేపదే అవే తప్పుల్ని చేస్తున్న తెలుగు టైటాన్స్ సొంతగడ్డపై వరుసగా రెండో పరాజయాన్ని ఖాతాలో వేసుకుంది. మ్యాచ్ ఆరంభంలో టైటాన్స్ దూకుడు ప్రదర్శించింది. ఆట 4వ నిమిషం వరకూ 4-1తో ఆధిక్యంలోకి వెళ్లిన టైటాన్స్.. ఓ దశలో 10-6తో బెంగళూరుపై ఆధిపత్యం చెలాయించింది.