Pro Kabaddi 2018 : Telugu Titans Defeated Patna Pirates | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-14

Views 1

Telugu Titans defeated Patna Pirates for the third time in the ongoing edition of Pro Kabaddi League as they secured a 41-36 win. Catch Telugu Titans vs Patna Pirates match highlights.
#ProKabaddiLeague
#ProKabaddi2018
#TeluguTitans
#PatnaPirates

గతమ్యాచ్‌లో ఓటమితో నిరాశపరిచిన తెలుగు టైటాన్స్‌ మళ్లీ గెలుపుబాట పట్టింది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో టైటాన్స్ సొంతగడ్డపై జరిగిన ఆఖరి మ్యాచ్‌ను విజయంతో ముగించింది. గురువారం జరిగిన జోన్‌-బి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ ప్రథమార్ధానికి 26-15తో ఆధిక్యంలో నిలిచిన టైటాన్స్‌ చివరకు 5 పాయింట్ల తేడాతో నెగ్గింది. ఇలా 41-36 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ పట్నా పైరేట్స్‌ను ఓడించింది. దీంతో ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. లీగ్ చరిత్రలో 800 రైడింగ్ పాయింట్లు సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన రాహుల్ ఈ మ్యాచ్‌లోనూ సత్తా చాటాడు. రాహుల్‌ చౌదరీ (13) అంచనాల మేర రాణించి అభిమానులకు ఆనందాన్ని మిగిల్చాడు. అతనితో పాటు నీలేశ్ సులంకే (9), మోహసెన్ (5), విశాల్ (4) మెరవడంతో టైటాన్స్‌ సులభంగా మ్యాచ్‌ను సొంతం చేసుకుంది.

Share This Video


Download

  
Report form