Rafale Verdict: #SCNailsRaGaLies : Amit Shah Targets Rahul Gandhi | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-14

Views 183

Rahul Gandhi Must Apologise For Misleading The Nation Says Amit Shah After Rafale Verdict. Truth always triumphs! Court's judgment on the Rafale deal exposes the campaign of misinformation spearheaded by Congress president for political gains. The court didn't find anything wrong with the process, nor did it find any commercial favouritism in the deal," Amit Shah said in a tweet soon after the verdict was delivered.
#SCNailsRaGaLies
#RafaleVerdict
#RahulGandhi
#AmitShah
#modi


రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు పైన దర్యాఫ్తు జరపాలని వేసిన పిటిషన్లను భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుక్రవారం కొట్టివేసింది. రాఫెల్ వివాదంపై ఎలాంటి విచారణ అవసరం లేదని, దాంట్లో జోక్యం చేసుకోవాల్సిన ఎటువంటి కోణం లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఈ విషయంలో విమర్శలు చేస్తోంది. సుప్రీం తీర్పు రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ట్విట్టర్ ద్వారా స్పందించారు. నిజం ఎప్పటికీ విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ రాజకీయ లబ్ధి కోసం రాఫెల్ డీల్ విషయంలో తప్పుడు సమాచారాన్ని ఉద్దేశ్యపూర్వకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారని చెప్పారు. రాఫెల్ డీల్ విషయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ న్యాయస్థానానికి ఎక్కడ కూడా తప్పుడు అంశాలు కనిపించలేదని, అలాగే ఏ ఒక్క కంపెనీకి ఆర్థిక ప్రయోజనాల కోసం చేసినదిగా కనిపించలేదని కాంగ్రెస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS