India vs Australia 2nd Test : Rishabh Pant Creates Another Record With 15 Catches | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-17

Views 125

Rishabh Pant overtook the previous record of 14 held by Kirmani, Dhoni, Dhoni (in Australia, 2014/15 - 13 ct; 1 st) and Wriddhiman Saha (in India 2016/17 - 13 ct; 1 st) In India vs Australia Test Series.
#IndiavsAustralia
#INDVSAUS
#RishabhPant
#IndiavsAustralia2ndTest
#viratkohli
#AjinkyaRahane


ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా అడుగుపెట్టిన టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ రికార్డుల పరంపర మొదలుపెట్టాడు. ఇలా రిషబ్ పంత్ మరో అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఏకంగా 11 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డు సాధించిన వికెట్ కీపర్ పంత్.. పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలుకొట్టాడు. ఆసీస్‌తో ఓ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఆతిథ్య ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ షమీ బౌలింగ్‌లో షాన్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో 15 ఔట్లలో పంత్ కీలకపాత్ర పోషించాడు. దీంతో గతంలో ఒకే టెస్టు సిరీస్‌లో 14 మంది ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఔట్లలో భాగంగా నిలిచిన ధోనీ, సాహా, సయ్యద్ కిర్మాణీలను పంత్ వెనక్కి నెట్టేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS