Pethai Own Record That Cross The Coast Two Times | Oneindia Telugu

Oneindia Telugu 2018-12-18

Views 1

The tiredness of the Pethai storm, which has been torn apart, is rare. Pethai own record that cross the coast two times. Usually any storm will pass through the coast at once. It is rare that a storm crossing the coast twice told by weather department officials. As this same like occured in 1970's.
#Pethai
#rains
#weather
#Crossing
#weatherreport
#kakinada
#yanam

అల్లకల్లోలం చేసి వెళ్లిపోయిన పెథాయ్ తుపాను అరుదైన ప్రత్యేకత సొంతం చేసుకుంది. రెండు సార్లు తీరం దాటి ఔరా అనిపించుకుంది. సాధారణంగా ఏ తుపాను ఐనా ఒకేసారి తీరం దాటి వెళ్లిపోతాయి. అయితే పెథాయ్ తుపాను కాకినాడ సమీపంలో కాట్రేని కోన - యానాం మధ్య సోమవారం మధ్యాహ్నం మొదటిసారి తీరం దాటింది. తుని దగ్గర రాత్రి మరోసారి తీరం దాటి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో తుపాన్లు భూమిని తాకుతుంటాయి. భూ ఉపరితలంపై కొద్ది దూరం ప్రయాణించాక అవి బలహీనపడిపోతాయి. అయితే పెథాయ్ తుపాను మాత్రం భిన్నమైన పరిస్థితులు క్రియేట్ చేసింది. సోమవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి తీరాన్ని తాకిని పెథాయ్ తుపాను దిశను మార్చుకుని సముద్రగర్భంలోకి వెళ్లిపోయింది. సోమవారం సాయంత్రం 5.00 - 5.30 గంటల సమయంలో పెథాయ్ తుపాను కాకినాడ సమీపంలో కేంద్రీకృతమై ఉంది. తీరా రాత్రి సమయంలో తుని దగ్గర మరోసారి తీరం తాకడం విశేషం.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS