Ind vs Aus 3rd Test Day 4 : India Need Two Wickets To Take 2-1 Series Lead

Oneindia Telugu 2018-12-29

Views 502

Pat Cummins scored a gritty half-century as Australia ended the fourth day at 258/8, 141 runs away from huge target of 399 runs in the Boxing Day Test at the MCG, Melbourne, on Saturday.
మెల్‌బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్‌ విజయానికి రెండు వికెట్ల దూరంలో నిలిచింది. నాలుగోరోజే విజ‌యం సాధించాల‌న్న భార‌త్ ఆశ‌ల‌పై ఆసీస్ బౌలర్లు పాట్ కమ్మిన్స్, నాథన్ లియాన్ నీళ్లు చల్లారు. వీరి వికెట్ల కోసం ఎన్ని వ్యూహాలు.. బౌలర్లను మార్చినా అవకాశం ఇవ్వలేదు.
మ్యాచ్‌ ఫలితం కోసం అంపైర్లు ఆటను అరగంట పొడిగించినా ఈ టెయిలండర్‌ జోడీ భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. వీరిద్దరూ ఇప్పటికే 43 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆటలో నాలుగో రోజైన శనివారం 399 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 258/8తో ఓటమి అంచున ఉంది.
#IndiavsAustralia2018
#ViratKohli
#3rdTestday4
#JaspritBumrah
#Pujara
#MayankAgarwal
#hanumavihari
#MuraliVijay
#RohitSharma

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS