Dil Raju has countered Peta Producer over theatres issue to Peta movie. Dil Raju explained that the release dates of the three Telugu movies NTR Biopic, F2 and Vinaya Vidheya Rama were announced six months back and clarified that it became tough to adjust the screens for these movies also.
'పేట' చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్న నిర్మాత వల్లభనేని అశోక్... ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటులో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు, అల్లు అరవింద్, యూవి క్రియేషన్స్ వారు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించడంతో పాటు.... కుక్కలు, షూట్ చేయాలి, థియేటర్ మాఫియా అనే అభ్యంతరకర పదాలు వాడుతూ ఆగ్రహంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం జరిగిన ఎఫ్ 2 ట్రైలర్ రిలీజ్ ఈవెంటులో దిల్ రాజు స్పందించారు. ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, ఎఫ్2...ఈ మూడు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన భారీ బడ్జెట్, ప్రతిష్టాత్మక చిత్రాలు. ఆరు నెలల క్రితమే వీటి రిలీజ్ డేట్స్ అనౌన్స్ అయ్యాయి. ఈ సినిమాలకే థియేటర్లు ఎలా సెట్ చేసుకోవాలో అని ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్లు చాలా స్ట్రగుల్ అయ్యాం. నెల రోజుల క్రితం తమిళ సినిమా(పేట)ను కొనుగోలు చేసి సంక్రాంతి రిలీజ్ అని అనౌన్స్ చేశారు. మూడు తెలుగు సినిమాలు ఉన్నపుడు పక్కరాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్లు ఎలా అడ్జెస్ట్ అవుతాయి? అని దిల్ రాజు ప్రశ్నించారు.
#NTRBiopic
#F2
#VinayaVidheyaRama
#DilRaju
#Peta