Seventy-seven days after he came back to office, CBI director Alok Verma reversed transfer orders of some of his key officers, who were sent out by interim chief M Nageshwar Rao while Verma was exiled on a forced leave.
#AlokVerma
#CBI
#Modigovt
#SupremeCourt
77 రోజుల తర్వాత సీబీఐలోని తన కార్యాలయానికి వచ్చిన డైరెక్టర్ అలోక్ వర్మకు తాత్కాలిక సీబీఐ చీఫ్ నాగేశ్వర రావు, ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఆయనతో పాటు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్తానాను కేంద్ర ప్రభుత్వం సెలవుల పైన పంపించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నాగేశ్వర రావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు. నాగేశ్వర రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా రాగానే పలువురు అధికారులను బదలీ చేశారు. ఇప్పుడు అలోక్ వర్మ వచ్చీ రాగానే అంతే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ బదలీలను నిలిపివేశారు. అలోక్ వర్మ సెలవులపై వెళ్లిన తర్వాత, 2018 అక్టోబర్ 24వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు పలు బదలీలు జరిగాయి. ఆ బదలీలను క్యాన్సిల్ చేస్తున్నట్లు ఇప్పుడు వర్మ ప్రకటించారు.