Royal Challengers Bangalore (RCB) had a special guest on Tuesday (March 19) at the iconic M Chinnaswamy Stadium as they prepared for the upcoming season of the Indian Premier League (IPL) 2019.
#IPL2019
#ViratKohli
#RoyalChallengersBangalore
#SunilChhetri
#MSDhoni
#chennaisuperkings
#RohitSharma
#Mumbai Indians
మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2019 సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జట్లకు చెందిన ఆటగాళ్లు జట్టుతో కలిసి ట్రైనింగ్ క్యాంపులకు హాజరవుతున్నారు. తాజాగా మంగళవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ట్రైనింగ్ క్యాంపుకి అనుకోని అతిథి వచ్చాడు.
దీంతో ఆటగాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. భారత పుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి చిన్నస్వామి స్డేడియానికి వచ్చాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులోని ఆటగాళ్లకు కోహ్లీనే స్వయంగా సునీల్ చెత్రిని పరిచయం చేశాడు.
ఈ సందర్భంగా ఈ రోజంతా తన స్నేహితుడు తమతోనే గడుపుతాడని అతనికి సహకరించాల్సిందిగా కోహ్లీ కోరాడు. ఈ క్రమంలో పలువురు యువ క్రికెటర్లు సునీల్ ఛెత్రి ఫిట్‌నెస్ గురించి వాకబు చేశారు. ఈ విషయాన్ని కోహ్లీ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.