AP Assembly Elections 2019: ఏపి డిజిపి కారులో త‌నిఖీలు... ఎందుకు చేసారు?? ఏం తేల్చారు??

Oneindia Telugu 2019-04-03

Views 1

AP Police searches in DGP Thakur travelling Vehicle now became hot discussion. As in regular searches in elections time police also searched DGP car in Vizianagaram. DGP also welcome these searches.
#apassemblyelections2019
#appolice
#elections
#electioncommission
#ycp
#dgpthakur
#vizianagaram
#araku
#srungavarapukota

ఏపి ఎన్నిక‌ల వేళ ఓ అనూహ్య ప‌రిణామం చోటు చేసుకుంది. ఏకంగా రాష్ట్ర డిజిపి ప్ర‌యాణిస్తున్న కారులోనే పోలీసు సి బ్బంది త‌నిఖీలు చేసారు. కొద్ది రోజుల క్రితం ప్ర‌తిప‌క్ష వైసిపి నేత‌లు కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి స్వ‌యంగా డిజి పి త‌న కారులో డ‌బ్బులు త‌రలిస్తున్నార‌ని ఫిర్యాదు చేసారు. అయితే, ఇందులో వాస్త‌వం ఎంత అనేది తేల‌లేదు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌ల వేళ పోలీసు సిబ్బంది ఏకంగా డిజిపి కారునే త‌నిఖీ చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది..

ఏపి డిజిపి కారును పోలీసు సిబ్బంది త‌నిఖీ చేసార‌నే వార్త పై ర‌క ర‌కాల వాద‌న‌లు తెర మీద‌కు వ‌స్తున్నాయి. ఎన్నిక‌ల వేళ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితులను పరిశీలించేందుకు డిజిపి ఠాకూర్ ప్రైవేటు వాహ నాల్లో క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లారు. డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ శృంగవరపుకోట మీదుగా అరకువైపు వాహనంలో వెళుతూ బొడ్డవర సమీపానికి చేరుకున్నారు. పోలీసు, అధికార బృందాలు వాహనాలను తనిఖీ చేస్తున్నాయి. యథావిధిగా తన వాహనాన్ని కూడా తనిఖీ చేయాలని డీజీపీ ఆదేశించటంతో తనిఖీ సిబ్బంది క్షుణ్ణంగా పరిశీలించారని స్థానిక అధికా రులు చెబుతున్నారు. అయితే, ప్ర‌యివేటు వాహ‌నంలో రావ‌టంతో స్థానిక సిబ్బంది డిజిపి ని గుర్తించ‌లేక సాధార‌ణ క్ర‌మంలో త‌నిఖీలు చేసార‌ని మ‌రో వాద‌న తెర మీద‌కు వ‌చ్చింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS