IPL 2019:Mumbai Indians defeated Chennai Super Kings by 1 run to win a record fourth IPL title. The Rohit Sharma-led outfit successfully defended the 150-run target.
#ipl2019winner
#mumbaiindians
#cskvmi
#rohitsharma
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుని ముంబై ఇండియన్స్ చరిత్ర సృష్టించింది. ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. సీజన్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ని ఓడించడం ఎలా..? దీనిపై ప్రత్యర్థి ముంబయి ఇండియన్స్ టీమ్ కంటే.. ఓ అభిమాని అతిగా ఆలోచించినట్లున్నాడు. ఆలోచించడమే కాదు.. ఓ 11 పాయింట్లతో ఏకంగా చిన్న వ్యూహాన్నే తయారు చేసి ముంబయి టీమ్‌కి సాయపడే ప్రయత్నం చేశాడు. అతను తయారు చేసిన వ్యూహం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మ్యాచ్‌లో ముంబయి జట్టు టాస్ గెలిస్తే.. తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాలని సూచించిన అభిమాని.. ఆరో బౌలర్ (అదనపు బౌలర్)తో బరిలోకి దిగాలని సూచించాడు. అది కూడా విదేశీ బౌలర్ హెండ్రిక్స్‌ని ఎంచుకోవాలని కోరాడు. ఇక విదేశీ ఆటగాళ్లు ఎవరెవరు టీమ్‌లో ఉండాలి.. ఇండియన్ ప్లేయర్స్‌లో ఎవరిని ఆడించాలో కూడా అందులో పేర్కొన్నాడు.