ICC Cricket World Cup 2019: West Indies vs New Zealand Warm-Up Match: West Indies Win By 91 Runs!!

Oneindia Telugu 2019-05-29

Views 3

Andre Russell and Jason Holder's 82-run partnership for seventh wicket in just 39 deliveries helped West Indies set a mammoth target of 422 .Chasing 422 for an improbable win, New Zealand suffered a top-order collapse and, despite a hundred from wicketkeeper Tom Blunde (106) and a 64-ball 85 from captain Kane Williamson, they were bundled out for 330 in 47.2 overs.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#newzealand
#westindies
#kanewilliamson
#hope
#russell

ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం న్యూజిలాండ్‌తో జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 91 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్రిస్టల్ మైదానంలో పరుగుల వరద పారింది. ఇరు జట్ల బ్యాట్స్‌మన్‌లు చెలరేగి ఆడటంతో మ్యాచ్‌లో మొత్తం 751 పరుగులు నమోదయ్యాయి. బ్యాట్స్‌మన్‌ల దాటికి మాట్ హెన్రీ, ఒశానే థామస్ లాంటి బౌలర్లు కూడా ఓవర్‌కు 11కు పైగా పరుగులు సమర్పించుకున్నారు.

మొదటగా బ్యాటింగ్ చేసిన విండీస్‌ 49.2 ఓవర్లలో 421 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మన్‌ చెలరేగి ఆడారు. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌ (22 బంతుల్లో 36; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), ఎవిన్‌ లూయీస్‌ (54 బంతుల్లో 50; 6 ఫోర్లు, సిక్స్‌)లు ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించారు. అనంతరం షై హోప్‌ (86 బంతుల్లో 101; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగాడు. ఇక ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌ హోల్టర్‌ (32 బంతుల్లో 47; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. కివీస్ బౌలర్ బౌల్ట్‌ నాలుగు వికెట్లు దక్కాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS